విజయవాడ కృష్ణలంక కరకట్ట వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొది. కరకట్ట సుందరీకరణ పేరుతో ఇళ్ల తొలగింపుకు రంగం సిద్ధం అయింది.
విజయవాడ : విజయవాడ కృష్ణలంక కరకట్ట వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొది. కరకట్ట సుందరీకరణ పేరుతో ఇళ్ల తొలగింపుకు రంగం సిద్ధం అయింది. అయితే పేదల ఇళ్లకు భరోసా తనదేనని గతంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇళ్ల తొలగింపుకు అధికారులు రావటంతో... గద్దె రామ్మోహన్ మొహం చాటేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎమ్మెల్యే కరకట్ట వద్దకు రావాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. అంతేకాకుండా అధికారులు చేపట్టిన సర్వే ప్ర్రక్రియను అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.