
ఎల్‌ఐసీ వారోత్సవాలు ప్రారంభం
భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) 60 వార్షికోత్సవాల సందర్భంగా గురువారం నుంచి ఈనెల 7 వరకు నిర్వహిస్తున్న డైమండ్ జూబ్లి వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.
కోదాడఅర్బన్: భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) 60 వార్షికోత్సవాల సందర్భంగా గురువారం నుంచి ఈనెల 7 వరకు నిర్వహిస్తున్న డైమండ్ జూబ్లి వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కోదాడ పట్టణంలోని సంస్థ కార్యాలయంలో ఈ ఉత్సవాలను స్థానిక కరూర్ వైశ్యాబ్యాంక్ మేనేజర్ భార్గవ శ్రీరామ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎల్లవేళలా సేవలందిస్తూ ఎల్‌ఐసీ దేశీయ బీమా రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ ఎస్‌బీఎం పి.వెంకటేశ్వర్లు, ఏడీఎం చెన్నకేశవులు, ఎఓ హరి, ఏబీఎం కోట్యానాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు బీబీనాయక్, ప్రసాద్‌బాబు, పలువురు డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, లియాఫీ కార్యవర్గ సభ్యులు, ఏజెంట్లు పాల్గొన్నారు.