ప్రజలకు చేరువలో ఎల్‌ఐసీ సేవలు | lic in public service | Sakshi
Sakshi News home page

ప్రజలకు చేరువలో ఎల్‌ఐసీ సేవలు

Sep 1 2016 11:06 PM | Updated on Oct 3 2018 7:02 PM

బీమారంగంలో 60 సంవత్సరాలుగా సేవలందించి దేశంలోనే బీమాకంపెనీలలో ఎల్‌ఐసీ అగ్రగామిగా నిలిచిందని డివిజనల్‌ మేనేజర్‌ కంచర్ల కిశోర్‌ అన్నారు. ఎల్‌ఐసీ వారోత్సవాల్లో భాగంగా గురువారం ముఖ్య అథితిగా ఆయన హజరయ్యారు.

  • అగ్రగామిగా జీవితబీమా సంస్థ
  • డివిజనల్‌ మేనేజర్‌ కిశోర్‌
  • కరీంనగర్‌ : బీమారంగంలో 60 సంవత్సరాలుగా సేవలందించి దేశంలోనే బీమాకంపెనీలలో ఎల్‌ఐసీ అగ్రగామిగా నిలిచిందని డివిజనల్‌ మేనేజర్‌ కంచర్ల కిశోర్‌ అన్నారు. ఎల్‌ఐసీ వారోత్సవాల్లో భాగంగా గురువారం ముఖ్య అథితిగా ఆయన హజరయ్యారు. అనంతరం విలే కరుల సమావేశంలో కిశోర్‌ మాట్లాడుతూ విజన్‌ 2020లో భాగంగా ప్రతి వ్యక్తిని పాలసీదారుడుగా తయారుచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పాలసీదారుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రవేశపెడుతున్న పాలసీలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. సంక్షేమంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గురుతరమైన బాధ్యతను పోషిస్తున్న ఎల్‌ఐసీకి అండగా ఉండాలని కోరారు. ఈ సంవత్సరంలో 232.32 లక్షల క్లేయింలను పరిష్కరించి దాదాపు రూ.90.5 కోట్లు చెల్లింపులు చేసిందన్నారు. ఎల్‌ఐసీ పోర్టల్‌ ద్వారా 35,634 సంస్థలు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 10,878 మంది ప్రతిభగల పేద విద్యార్థులకు రూ.10 వేల రూలు స్కాలర్‌షిప్‌ అందించినట్లు తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కృష్ణదాస్, తిరుపతిరావు, ఆకుల శైలజ, విజయమోహన్‌రెడ్డి, ఎం.హరీశ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, రఘురాం పాల్గొన్నారు. 
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement