కనుల పండువగా లక్ష పుష్పార్చన | lakshi pushparchana | Sakshi
Sakshi News home page

కనుల పండువగా లక్ష పుష్పార్చన

Jul 21 2017 10:39 PM | Updated on Jun 1 2018 8:39 PM

కనుల పండువగా లక్ష పుష్పార్చన - Sakshi

కనుల పండువగా లక్ష పుష్పార్చన

ఆషాఢ మాస చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని స్థానిక పాతూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చన కనుల పండువగా జరిగింది.

అనంతపురం కల్చరల్‌: ఆషాఢ మాస చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని స్థానిక పాతూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చన కనుల పండువగా జరిగింది. వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రత్యేక పూజల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని లలితామాతకు వివిధ రకాల పుష్పాలతో అర్చన నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో వాసవీ మాతకు శాకంబరీ అలంకారం చేసి ఆరాధించారు. అనంతరం మహా మంగళహారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement