ఘనంగా కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు | kullaiswamy brahmotsavas | Sakshi
Sakshi News home page

ఘనంగా కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు

Oct 8 2016 12:12 AM | Updated on Sep 4 2017 4:32 PM

ఘనంగా కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు

ఘనంగా కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు

గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  ఉత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం కుళ్లాయిస్వామికి నిత్యపూజ నివేదన ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వేకువజామున ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప స్వామివారి చావిడిలో ఫాతెహాæ పూజలు జరిపారు. ఆలయ అనవాయితి ప్రకారం స్వామివారి కాపులైన తిరుమల కొండారెడ్డి వంశీకులు, ముజావర్లు ప్రత్యేక పూజలు చేశారు.

తహశీల్దార్‌ విజయలక్ష్మి గూగూడును సందర్శించి  ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి ఐదవ సరిగెత్తు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అక్కిరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement