వేసవిలో పాలమూరు జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎగువనున్న నారాయణపూర్ జలాశయం పరిధిలోని గూడూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు కర్ణాటక ప్రభుత్వం ఆదివారం ఒక టీఎంసీ కృష్ణా జలాలను విడుదల చేసింది.
కర్ణాటక: వేసవిలో పాలమూరు జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎగువనున్న నారాయణపూర్ జలాశయం పరిధిలోని గూడూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు కర్ణాటక ప్రభుత్వం ఆదివారం ఒక టీఎంసీ కృష్ణా జలాలను విడుదల చేసింది. ఎల్లుండి కల్లా మహబూబ్‌నగర్ జిల్లాకు కృష్ణా జలాలు చేరుకోనున్నాయి. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినట్టు తెలుస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ జలాశయం నుంచి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ హరీష్‌రావు ఇటీవల పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఒక టీఎంసీ నీటి విడుదలకు బెంగళూరులోని కృష్ణా భాగ్య జల నిగమ్ అంగీకరించింది.