కృష్ణా పుష్కరాల్లో ఆర్యవైశ్య సేవలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రానున్న కృష్ణా పుష్కారాలకు విచ్చేసే భక్తుల కోసం ఆర్యవైశ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వాసవీ సేవాదళ్ చైర్మన్ చుండూరు ఉమా మహేశ్వరరావు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రానున్న కృష్ణా పుష్కారాలకు విచ్చేసే భక్తుల కోసం ఆర్యవైశ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వాసవీ సేవాదళ్ చైర్మన్ చుండూరు ఉమా మహేశ్వరరావు తెలిపారు. కష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో శ్రీ శివస్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అతిరుద్ర మహాయాగం కరపత్రాలను శనివారం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి సత్రంలో ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన ఉమా మహేశ్వరరావు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, వాసవీ సేవాదళ్, ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా పుష్కర భక్తులకు అల్పాహారం, మంచినీరు, భోజన సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు.
అతిరుద్ర మహాయాగం 12 రోజులపాటు జరుగుతుందని, రోజూ 200 మంది పీఠాధిపతులు ఉదయం, సాయంత్రం 900 మంది దంపతులు ఈ యాగంలో పాల్గొంటారని చెప్పారు. ఈ యాగాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రారంభిస్తారని చెప్పారు. కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమం తాళ్లాయపాలెంలో జరగనున్నట్టు వివరించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు అంబికా రాజా మాట్లాడుతూ పుష్కరాల్లో సేవ చేయడానికి ముందుకు వచ్చేవారు తమ పాస్‌పోర్టు ఫొటో, ఆధార్ కార్డుతో సహా తాళ్లాయపాలెం రావచ్చన్నారు. గొంట్లా రామ్మోహనరావు, పయిడేటి రఘు, మద్దుల రవి కుమార్, మద్దుల ప్రసాదరావు, వాసవి సుబ్బారావు, పయిడేటి భవాని, టీవీ సుబ్బారావు, గూడవల్లి శ్రీనివాస్, ఎం.సదానందకుమార్ పాల్గొన్నారు.