నిడదవోలు కోటసత్తెమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు.
కోటసత్తెమ్మ వారి ఆదాయం రూ.2.34 లక్షలు
Oct 9 2016 10:29 PM | Updated on Sep 27 2018 4:42 PM
నిడదవోలు : నిడదవోలు కోటసత్తెమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద చండీ పారాయణం, చండీహోమంతో పాటు 494 మంది దంపతులచే సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు రాజమండ్రికి చెందిన కలవకొలను హర్షవర్ధన్, నిడదవోలుకు చెందిన ముళ్లపూడి సోమరాజు వారిచే చక్కెర పొంగళి, దేవస్థానం వారిచే పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. అమ్మవారికి ఆదివారం వివిధ రూపాల్లో రూ. 2,34,307 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి యాళ్ల శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, అర్చకులు అప్పారావుశర్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement