రూ. 100కే కిలో చికెన్.. | kilo chicken hundred rupees in kodada | Sakshi
Sakshi News home page

రూ. 100కే కిలో చికెన్..

Aug 5 2015 6:11 PM | Updated on Jul 29 2019 5:43 PM

రూ. 100కే కిలో చికెన్.. - Sakshi

రూ. 100కే కిలో చికెన్..

కాడెద్దుల పోరులో లేగదూడల కాళ్లు విరగడం అంటే ఇదేనేమో.

కోదాడ టౌన్: కాడెద్దుల పోరులో లేగదూడల కాళ్లు విరగడం అంటే ఇదేనేమో..! ఇద్దరు బడా చికెన్ వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా కిలో చికెన్ ధర రూ.100కు పడిపోయింది. దీంతో చికెన్ చిరు వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. అయితే, కోడిమాంసం ప్రియులు మాత్రం సంతోషంతో ఉన్నారు. ఇదంతా నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న వివాదం. వివరాలు.. పట్టణంలో దాదాపు 25 చికెన్ దుకాణాలున్నాయి. వారికి కావాల్సిన కోళ్లను కోదాడకు చెందిన ఇద్దరు వ్యాపారులు సరఫరా చేస్తారు. వారు కిలోకి కొంత కమీషన్ తీసుకుంటారు.

 

వారి మధ్య వచ్చిన పోటీతో తమ రిటైల్ దుకాణాల్లో చికెన్ ధర తగ్గించి అమ్మడం ప్రారంభించారు. దీంతో చిరు వ్యాపారులు కూడా అదే అనుసరించాల్సిన దుస్థితి ఏర్పడింది. వారం క్రితం వరకు కేజీ బాయిలర్ చికెన్ రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.100కు తగ్గించారు. బడా వ్యాపారుల పోటీతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరో పది రూపాయలను తగ్గించి తమను కోలుకోనీయకుండా పథకం వేస్తున్నారని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement