ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటితొట్టిలో పడి మృతిచెందింది.
అశ్వరావుపేట: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటితొట్టిలో పడి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంపసాటి పూజిత(3) ఇంటి ముందు ఆడుకుంటు వెళ్లి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడింది. తల్లిదండ్రులు ఇది గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందింది. తల్లిదండ్రులు గమనించేసరికి తమ ముద్దుల కూతురు నీటితొట్టెలో శవమై కనిపించడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.