హోరాహోరీగా ఖోఖో పోటీలు | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఖోఖో పోటీలు

Published Sat, Dec 3 2016 9:47 PM

Kho Kho competitions rocking

గుంటూరు స్పోర్ట్స్‌:  ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడాపోటీలలో భాగంగా జిల్లా క్రీడాభివృ«ద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అండర్‌–14, 17 బాలబాలికల ఖోఖో పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలలో 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో జోసఫ్‌ కుమార్‌ బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు తదితరులు పాలొన్నారు.అండర్‌–14 బాలుర విభాగంలో మాచర్ల జట్టు ప్రథమ, సత్తెనపల్లి జట్టు ద్వితీయ, వినుకొండ జట్టు తృతీయ స్థానాలు సాధించాయి.బాలికల విభాగంలో మాచర్ల జట్లు ప్రథమ, బాపట్ల ద్వితీయ, వినుకొండ తృతీయ స్థానాలు సాధించాయి. అండర్‌–17 బాలుర విభాగంలో బాపట్ల జట్టు ప్రథమ, చిలకలూరి పేట జట్టు ద్వితీయ, గురజాల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో  మాచర్ల జట్టు ప్రథమ, వేమూరు జట్టు ద్వితీయ, ప్రత్తిపాడు జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. 

Advertisement
Advertisement