
కలాం జీవితం స్ఫూర్తిదాయకం
విద్యార్థులకు, యువతకు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం జీవితం ఆదర్శప్రాయమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు.
పోరుమామిళ్ల: విద్యార్థులకు, యువతకు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం జీవితం ఆదర్శప్రాయమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. కలాం జయంతి సందర్భంగా శనివారం వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటసుబ్బయ్య అధ్యక్షతన ‘కలాం..సలాం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి రచించి, దాతల సహకారంతో ప్రచురించిన పుస్తకాన్ని కలాం జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శారదమ్మ, మాజీ జెడ్పీటీసీ నాగార్జునరెడ్డి, రచయిత అబ్దుల్‌హక్, మదర్‌థెరెసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిప్రకాష్‌రెడ్డి, అధ్యాపకులు గోవిందరెడ్డి, చంద్రమౌళి, రంతుబాషా తదితరులు ఆవిష్కరించారు. ముందుగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ కలాం లాంటి మహోన్నత వ్యక్తి ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు. పేదరికంలో పుట్టిన సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి, దేశం కోసం జీవించాడన్నారు. సైంటిస్టుగా దేశానికి అందించిన సేవలు కొలమానం లేనివన్నారు. రాష్ట్రపతిగా కూడా ఆయన అతిసాధారణ జీవితం గడిపారని అలాంటి వ్యక్తిని అందరూ అధ్యయనం చేసి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘కలాం–సలాం’ పుస్తకాన్ని మనముందుకు తెచ్చిన రామకృష్ణారెడ్డి అభినందనీయుడన్నారు.