breaking news
MLC Govinda Reddy
-
కలాం జీవితం స్ఫూర్తిదాయకం
పోరుమామిళ్ల: విద్యార్థులకు, యువతకు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం జీవితం ఆదర్శప్రాయమని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. కలాం జయంతి సందర్భంగా శనివారం వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటసుబ్బయ్య అధ్యక్షతన ‘కలాం..సలాం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి రచించి, దాతల సహకారంతో ప్రచురించిన పుస్తకాన్ని కలాం జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శారదమ్మ, మాజీ జెడ్పీటీసీ నాగార్జునరెడ్డి, రచయిత అబ్దుల్‌హక్, మదర్‌థెరెసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిప్రకాష్‌రెడ్డి, అధ్యాపకులు గోవిందరెడ్డి, చంద్రమౌళి, రంతుబాషా తదితరులు ఆవిష్కరించారు. ముందుగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ కలాం లాంటి మహోన్నత వ్యక్తి ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు. పేదరికంలో పుట్టిన సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి, దేశం కోసం జీవించాడన్నారు. సైంటిస్టుగా దేశానికి అందించిన సేవలు కొలమానం లేనివన్నారు. రాష్ట్రపతిగా కూడా ఆయన అతిసాధారణ జీవితం గడిపారని అలాంటి వ్యక్తిని అందరూ అధ్యయనం చేసి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘కలాం–సలాం’ పుస్తకాన్ని మనముందుకు తెచ్చిన రామకృష్ణారెడ్డి అభినందనీయుడన్నారు. -
అమ్మవారిశాలలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు
బద్వేలు అర్బన్: స్థానిక అమ్మవారిశాలతో పాటు కోదండరామస్వామి ఆలయం , మహాలక్ష్మిదేవి ఆలయాలలో ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య వర్తక సంఘం వారు ఎమ్మెల్సీని మేళతాళాలతో సాదరంగా ఆహ్వానించి వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు జ్ఞాపికతో పాటు శాలువాతో ఎమ్మెల్సీని, సమన్వయకర్తను సత్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి, శ్రద్ధలతో దసరా పండుగ జరుపుకోవాలని , అమ్మవారు భక్తులందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ సింగసాని గురుమోహన్, సింగిల్ విండో అధ్యక్షులు సుందరరామిరెడ్డి, బి.కోడూరు జడ్పీటీసీ రామక్రిష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శులు సింగసాని శివయ్య, కొండుశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ భూపాల్‌రెడ్డి లతోపాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండపల్లి చిన్న సుబ్బారావు , పీవీఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.