ఆదాబ్‌..కబాబ్‌! | kabab fest in paradise hotel | Sakshi
Sakshi News home page

ఆదాబ్‌..కబాబ్‌!

Aug 16 2016 11:10 PM | Updated on Sep 4 2017 9:31 AM

ఆదాబ్‌..కబాబ్‌!

ఆదాబ్‌..కబాబ్‌!

ప్యారడైజ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్‌ ఫెస్టివల్‌ నోరూరిస్తున్నాయి.

రాంగోపాల్‌పేట్‌: ప్యారడైజ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్‌ ఫెస్టివల్‌లో వివిధ రకాల కబాబ్స్‌ నోరూరిస్తున్నాయి. మంగళవారం సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్యారడైజ్‌ హోటల్స్‌ సీఈవో గౌతమ్‌ గుప్త మాట్లాడుతూ సెప్టెంబర్‌ 30 వరకూ ఫెస్టివల్‌ కొనసాగుతుందన్నారు. మటన్, చికెన్, ఫిష్‌తో పాటు వెజిటేరియన్స్‌ కోసం ప్రత్యేక కబాబ్స్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

నగరంలోని ప్యారడైజ్‌కు చెందిన 15 ఔట్‌లెట్స్‌లతో పాటు బెంగుళూరులోనూ కబాబ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కల్మీ కబాబ్, చికెన్‌ టిక్కా, తందూరి చికెన్, రెష్మీ కబాబ్, గార్లిక్‌ కబాబ్, మటన్‌ కబాబ్‌్సలో సోలే, షీక్‌ కబాబ్, గులాటీ, ఫిష్‌లో ఫిష్‌ టిక్కా, తందూరి జింగా, కోకో ఫిష్, వెజ్‌లో పన్నీర్‌ టిక్కా, బూటేకే కబాబ్, చనా, ఆక్రుత్‌ వంటి విభిన్న రకాల టేస్ట్‌లతో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement