గడపగడపకు ‘న్యాయసేవ’
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించనున్నట్లు లోక్‌అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించనున్నట్లు లోక్‌అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. గడప గడపకు న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన అబ్బాస్‌నగర్‌లోని హౌసింగ్ బోర్డులో పర్యటించారు. కాలనీ ప్రజలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లావ్యాప్తంగా నవంబర్ 2, 3 తేదీల్లో న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవలను గడపగడపకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్యానల్ లాయర్లు, పారా లీగల్ సర్వీసు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. న్యాయ వాదులు రంగా రవికుమార్, మనోహర్ రాజు, మద్దిలేటి, రమేష్‌రాజు పాల్గొన్నారు.