జిల్లా గ్రామీణాభివృద్ధి, వెలుగు, కడప ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కడపలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనిడీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కడప కోటిరెడ్డి సర్కిల్:
జిల్లా గ్రామీణాభివృద్ధి, వెలుగు, కడప ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కడపలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనిడీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్ ఉద్యోగానికి సంబంధించి 50 ఖాళీలు ఉన్నాయని, ఇందుకు ఐటీఐ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 18–34 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలని, వేతనం నెలకు రూ. 5 వేలు ఉంటుందన్నారు. అలాగే ఫీల్డ్ కో–ఆర్డినేటర్స్ 50 ఖాళీలు ఉన్నాయన్నారు. దీనికి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ఉద్యోగానికి 18–34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. నెలకు రూ. 7 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అర్హతలు గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్‌కార్డులు జిరాక్స్ కాపీలను తీసుకుని కడప నగర శివార్లలోని టీటీడీసీలో ఈనెల 23వ తేది ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 96420 72966, 88858 65038 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.


