రాగివైరు దొంగలకు జైలు | jail for copher wire theafs | Sakshi
Sakshi News home page

రాగివైరు దొంగలకు జైలు

Jul 20 2016 10:27 PM | Updated on Sep 4 2017 5:29 AM

ట్రాన్స్‌ఫార్లర్లను పగలగొట్టి అందులోని రాగివైరును చోరీ చేసిన కేసులో నలుగురు వ్యక్తులకు బుధవారం రెండు నెలల జైలు శిక్ష విధించారు. జిల్లా మొదటి అదనపు జడ్జీ కుంచాల సునీత తీర్పు వెల్లడించినట్లు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమణారెడ్డి తెలిపారు.

ఆదిలాబాద్‌ క్రై ం : ట్రాన్స్‌ఫార్లర్లను పగలగొట్టి అందులోని రాగివైరును చోరీ చేసిన కేసులో నలుగురు వ్యక్తులకు బుధవారం రెండు నెలల జైలు శిక్ష విధించారు. జిల్లా మొదటి అదనపు జడ్జీ కుంచాల సునీత తీర్పు వెల్లడించినట్లు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమణారెడ్డి తెలిపారు. 2014లో నెలలో నిర్మల్, ఆదిలాబాద్‌ డివిజన్‌లలో అకారపు శివకుమార్, మహ్మద్‌ అవేజ్‌ఖాన్, దీప్‌సింగ్, అస్లంఖాన్‌లు పంటపొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగివైరు దొంగతనం చేసి అమ్ముకున్నారు. ఈ రెండు డివిజన్‌లలో వీరిపై 35 కేసులు నమోదయ్యాయి. 2014 డిసెంబర్‌ 11న అప్పటి సోన్‌ ఎసై ్స మహేందర్‌ అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆటోలో రాగివైరును తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో పలు ప్రాంతాల్లో రాగి వైరుదొంగతనం చేసి అమ్ముకున్నట్లు ఒప్పుకున్నారు. అమ్మిన దుకాణాల్లోంచి 7 క్వింటాళ్ల రాగివైరును రికవరీ చేశారు. దుండగులపై నమోదైన కేసుల్లో అదనపు పీపీ ముస్కు రమణారెడ్డి సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువైనందున నేరస్తులకు రెండు నెలల జైలు శిక్ష విధించి, రాగి వైరును ఫిర్యాదుదారులకు ఇవ్వాలని మొదటి అదనపు జిల్లా జడ్జి కుంచాల సునీత తీర్పు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement