
రహదారి నిర్వహణలోనూ నిర్లక్ష్యమే
ధవళేశ్వరం బ్యారేజి నిర్వహణలోనే కాదు.. దీనిపై ఉన్న రోడ్డు నిర్వహణలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నిడదవోలు, విజ్జేశ్వరం తదితర ప్రాంతాల ప్రజలు రాజమహేంద్రవరం రావాలంటే ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు.
- గోదావరి పుష్కరాల ఆరంభంలో బ్యారేజిపై రోడ్డు నిర్మాణం
- ఏడాది తిరగకుండానే గోతులు పడిన వైనం
- గోదారిలో కలిసిన రూ.అరకోటి నిధులు
- ∙ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా నిలుస్తున్న బ్యారేజిపై దెబ్బ తిన్న రహదారిని గత ఏడాది గోదావరి పుష్కరాల ఆరంభంలో సుమారు రూ.50 లక్షలతో నిర్మించారు.
- ఆ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పటించకపోవడంతో ఏడాది పూర్తి కాకుండానే ఈ రోడ్డు దెబ్బతింది.
- బ్యారేజి రోడ్డుపై జాయింట్ల వద్ద ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. అక్కడకు చేరేసరికి వాహనాలు ఎగిరి పడుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు కూడా పాడవుతున్నాయి.
- జాయింట్లవద్ద ఖాళీలు ఏర్పడటంతో పాటు అక్కడక్కడ ఇనుప ఊచలు పైకి లేచిపోయాయి.
- విద్యుద్దీపాలు వెలగక బ్యారేజిపై రాత్రి వేళల్లో అంధకారం అలముకుంటోంది. ఆ సమయంలో వాహనచోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.