ఎంపీఈవో పోస్టులకు ఇంటర్వ్యూలు | interviews for MPEO posts | Sakshi
Sakshi News home page

ఎంపీఈవో పోస్టులకు ఇంటర్వ్యూలు

Jul 30 2016 8:58 PM | Updated on Aug 20 2018 6:18 PM

జిల్లాలో బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణాధికారుల(ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి శనివారం కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 74 పోస్టులకు గాను జిల్లా వ్యాప్తంగా 324 దరఖాస్తులు అందాయి.

గుంటూరు వెస్ట్‌ : జిల్లాలో బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణాధికారుల(ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి శనివారం కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 74 పోస్టులకు గాను జిల్లా వ్యాప్తంగా 324 దరఖాస్తులు అందాయి. అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారులు 250 మందిని అర్హులుగా గుర్తించారు. అనంతరం వారందరికీ కలెక్టర్‌ చాంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ ముంగా వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ కృపాదాస్, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ పద్మావతి, డాట్‌ సైంటిస్టు రామ్‌ప్రసాద్, ఉద్యానశాఖ ఏడీ రామ్మోహన్‌ తదితరులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీఈఓ పోస్టులకు ఎంపికైన వారికి త్వరలోనే సమాచారం అందజేస్తామని వ్యవసాయాధికారులు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement