క్రీడల్లో రాణిస్తే గుర్తింపు | inter college university cricket champion ssbn | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణిస్తే గుర్తింపు

Dec 25 2016 1:15 AM | Updated on Sep 4 2017 11:31 PM

క్రీడల్లో రాణించడం ద్వారా గుర్తింపు లభిస్తుందని నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల అధ్యక్షుడు, పీడీ చంద్రమోహన్‌ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : క్రీడల్లో రాణించడం ద్వారా గుర్తింపు లభిస్తుందని నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల అధ్యక్షుడు, పీడీ చంద్రమోహన్‌ తెలిపారు. శనివారం ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల క్రికెట్‌ జట్టు ఎస్‌కేయూ పరిధిలో జరిగిన ఇంటర్‌ కళాశాలల యూనివర్సిటీ క్రికెట్‌ చాంపియన్‌గా ఏడుసార్లు విజేతగా నిలిచి ఘనత సాధించిందన్నారు.

క్రీడల్లో రాణింపు ద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. తమ కళాశాల క్రీడాకారులు వరుస విజయాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ పీఎల్‌ఎన్‌ రెడ్డి, సెక్రెటరీ విజయ్‌కుమార్, ప్రిన్సిపల్‌ నాగత్రిశూలపాణి, స్పోర్ట్స్‌ కమిటీ సభ్యులు రామాంజనేయులు, శివరామకృష్ణ, దాదాపీర్, పుణ్యవతి, పీడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement