అంపైరింగ్‌లో ‘ సింగ్‌ ’.. | in umpiring "sing '.. | Sakshi
Sakshi News home page

అంపైరింగ్‌లో ‘ సింగ్‌ ’..

Oct 26 2016 10:38 PM | Updated on Sep 4 2017 6:23 PM

అంపైరింగ్‌లో ‘ సింగ్‌ ’..

అంపైరింగ్‌లో ‘ సింగ్‌ ’..

గార్లమడుగు (పెదవేగి రూరల్‌) : స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.నాగేంద్రసింగ్‌ క్రికెట్‌లో అంపైర్‌గా రాణిస్తున్నారు.

గార్లమడుగు (పెదవేగి రూరల్‌) :  స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.నాగేంద్రసింగ్‌ క్రికెట్‌లో అంపైర్‌గా రాణిస్తున్నారు. ఏలూరుకు చెందిన దివ్యాంగుడైన ఈయనకు చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే మక్కువ. ఈ క్రమంలోనే క్రికెట్‌లో మెళకువలు నేర్చుకుని ఎంపైర్‌గా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. గత నెల 21వ తేదీ నుంచి బరోడాలో ప్రారంభమైన గుజరాత్‌ విద్యుత్‌ శాఖ క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీల్లో అంపైరింగ్‌ నిర్వహిస్తున్నారు. తనతో పాటు ఏలూరుకు చెందిన గొట్టుముక్కల రామలింగ సూర్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన దీపక్, బరోడకు చెందిన యోగేశ్‌ షిండేలు ఈ టోర్నమెంట్‌కు అంపైర్లుగా వ్యవహరిస్తున్నారని సింగ్‌ ఫోన్‌లో తెలిపారు. ఇప్పటివరకు వికలాంగ క్రికెట్‌ టోర్నమెంట్‌లకు మాత్రమే అంపైర్‌గా వ్యవహరించిన  తాను, తొలిసారిగా గుజరాత్‌ విద్యుత్‌ శాఖ నిర్వహిస్తోన్న టోర్నమెంట్‌లో అంపైరింగ్‌ చేస్తుండడం ఎంతో ఆనందాన్నించిదని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement