మట్టపల్లి వద్ద గణనీయంగా పెరిగిన కృష్ణానది నీటిమట్టం ... | in Mattapalli krishna river looks very large | Sakshi
Sakshi News home page

మట్టపల్లి వద్ద గణనీయంగా పెరిగిన కృష్ణానది నీటిమట్టం ...

Sep 22 2016 11:20 PM | Updated on Sep 4 2017 2:32 PM

మట్టపల్లి వద్ద గణనీయంగా పెరిగిన  కృష్ణానది నీటిమట్టం ...

మట్టపల్లి వద్ద గణనీయంగా పెరిగిన కృష్ణానది నీటిమట్టం ...

మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద పులిచింతల ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ భారీగా పెరగడంతో కృష్ణానది నీటి మట్టం గురువారం గణనీయంగా పెరిగి ప్రమాదకర స్థాయికి చేరింది.

– మట్టపల్లి ప్రమాదకరంగా కృష్ణానది నీటిమట్టం
మట్టపల్లి (మఠంపల్లి) :
మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద పులిచింతల ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ భారీగా పెరగడంతో కృష్ణానది నీటి మట్టం గురువారం గణనీయంగా పెరిగి ప్రమాదకర స్థాయికి  చేరింది. దీంతో దేవస్థానం వద్ద గల ప్రహ్లాద ఘాట్‌ నీట మునిగిపోవడంతో భక్తుల పుణ్య స్నానాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలు, కృష్ణానది వరద నీటి ప్రవాహంతో దేవాలయానికివచ్చే భక్తుల తాకిడి కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని మూసీనది, గుంటూరు జిల్లాలోని నాగులేరు భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది దీంతో పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద రిజర్వాయర్‌ నీటి సామర్ధ్యాన్ని భారీగావస్తున్న వరద నీటితో 28 టీఎంసీలకుపైగా నీటి నిల్వచేశారు. దీంతో దేవస్థానంవద్ద భారీగా వరద నీరు పెరిగింది. అయితే గడిచిన 5 రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ మట్టపల్లిని సందర్శించి పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద 30 టీఎంసీల నీటిని నిల్వచేసే అవకాశం ఉన్నందున బ్యాక్‌ వాటర్‌ పెరుగుతుందని మట్టపల్లి దేవస్థానంవద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  అంతేగాక మట్టపల్లి రేవు వద్ద ఉన్న బాలాజీ ఘాట్, హై లెవల్‌వంతెన ఘాట్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామస్థులెవరు నదిలోకి వెళ్లరాదని తహసీల్దార్‌ యాదగిరి, ఎస్‌ఐ ఆకుల రమేష్‌లు ఇప్పటికే గ్రామస్థులను అప్రమత్తం చేయగా ఆలయ ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్, ఈవో ఎంపి.లక్ష్మణరావులు దేవస్థానం వద్ద యాత్రీకులను నదిలోకివెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.





 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement