పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్, రూరల్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న పోటీలకు పంపించే ఎంట్రీలను ఈనెల 30వ తేదీ వరకు అందించవచ్చని సీపీ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు
‘అమరవీరుల సంస్మరణ’ పోటీల గడువు పెంపు
Aug 21 2016 12:08 AM | Updated on Sep 4 2017 10:06 AM
వరంగల్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్, రూరల్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న పోటీలకు పంపించే ఎంట్రీలను ఈనెల 30వ తేదీ వరకు అందించవచ్చని సీపీ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగా అన్ని పోటీలకు పంపించే ఎంట్రీలను ఈనెల 20వ తేదీ వరకు మాత్రమే అందించాలని గడువు విధించామన్నారు. అయితే అందరి విజ్ఞప్తి మేరకు ఈనెలాఖరు వరకు గడుపు పెంచినట్లు వారు పేర్కొన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌పై కథనాలు, వార్తలు, వీడియోలను కమిషనరేట్ పరిధిలోని ఎంట్రీలను పీఆర్వో మో హన్‌కృష్ణ(94409–04687), రూరల్ జిల్లా పోలీసు పరిధిలోని ఎంట్రీలను రూరల్ ఎస్పీ పీఆర్వో తాళ్లపల్లి రామారావు (94409–04670)కు అందించాలన్నారు.
Advertisement
Advertisement