రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | In Accident Three Are Injured | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Aug 14 2016 9:58 PM | Updated on Sep 4 2017 9:17 AM

చిన్నమండెం మండల పరిధిలోని దేవపట్ల రోడ్డు మార్గంలో పెట్రోలు బంక్‌ సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

చిన్నమండెం(రాయచోటి రూరల్‌): చిన్నమండెం మండల పరిధిలోని దేవపట్ల రోడ్డు మార్గంలో పెట్రోలు బంక్‌ సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండెం రెడ్డివారిపల్లె నుంచి దేవపట్ల మార్గంలో వెళ్తున్న ఆటో, ఎదురుగా చిన్నమండెంకు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుమ్మరపల్లెకు చెందిన ద్విచక్రవాహనంలో వస్తున్న నాగార్జునకు, ఆటోలో వెళ్తున్న రెడ్డివారిపల్లె వాసి రెడ్డిపీరాతోపాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చిన్నమండెం పోలీసులు 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగార్జునను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement