కుక్కునూరు : భర్త, అతని తరఫు బంధువులు వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది.
గృహిణి ఆత్మహత్య
Nov 4 2016 12:38 AM | Updated on Mar 28 2019 6:31 PM
	కుక్కునూరు : భర్త, అతని తరఫు బంధువులు వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ సాధిక్‌పాషా కథనం ప్రకారం..  ఇబ్రహీంపేటకు చెందిన గూడురు దుర్గ(35) భర్త రాంబాబు నిత్యం మద్యం సేవించి రావడంతోపాటు భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి చిత్రహింసలు గురిచేస్తున్నాడు. దీంతో దుర్గ మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఆమె ఈనెల ఒకటో తేదీన  కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను బంధువులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి మరణించింది. దుర్గ మృతికి తన తండ్రి, పెద్దనాన్నలే కారణమని మృతురాలి కూతురు తేజస్వీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
	 
	 
	 
	 
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
