కదిలిస్తే కన్నీళ్లే.. | hot touching movement | Sakshi
Sakshi News home page

కదిలిస్తే కన్నీళ్లే..

Sep 25 2016 9:40 PM | Updated on Aug 30 2019 8:19 PM

కదిలిస్తే కన్నీళ్లే.. - Sakshi

కదిలిస్తే కన్నీళ్లే..

సిరిసిల్ల రూరల్‌ కదిలిస్తే కన్నీళ్లే. అనేక ఏళ్లుగా గ్రామంతో పెనవేసుకున్న బంధం. కులమతాలకు అతీతంగా వరసలు పెట్టుకొని పిలుచుకునే ప్రేమానుబంధాలు. పైసాపైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లు, పొలాలు అన్నీ వదిలి వెళ్తుంటే ఆ గుండెలు చెరువయ్యాయి.

సిరిసిల్ల రూరల్‌   కదిలిస్తే కన్నీళ్లే. అనేక ఏళ్లుగా గ్రామంతో పెనవేసుకున్న బంధం. కులమతాలకు అతీతంగా వరసలు పెట్టుకొని పిలుచుకునే ప్రేమానుబంధాలు. పైసాపైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లు, పొలాలు అన్నీ వదిలి వెళ్తుంటే ఆ గుండెలు చెరువయ్యాయి. మ్రధ్యమానేరు ప్రాజñ క్ట్‌లో ముంపునకు గురైన చీర్లవంచలో ఆదివారం 450 కుటుంబాలను ఊరు ఖాళీచేయించారు. మధ్యమానేరులో కొన్ని ఇప్పటికే జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లడం, మానేరు ఉధృతంగా పారడంతో ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో స్పీల్‌వే వద్ద సుమారు 4టీఏంసీల నీరు ఆగిపోయింది. బ్యాక్‌వాటర్‌తో చీర్లవంచ సగం గ్రామం జలమయం కావడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి నేటికీపూర్తిస్థాయిలో పరిహారం రాలేదు. దీంతో ఊరు విడిచి వెళ్లే సమయంలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కందికట్కూర్‌కు వెళ్లి కలెక్టర్‌ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement