హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం | Hindu culture to be preserved | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం

Oct 29 2016 1:28 AM | Updated on Oct 20 2018 6:19 PM

హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం - Sakshi

హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం

నెల్లూరు(బృందావనం): సమాజంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు జిల్లాలోని ధర్మప్రచారక్‌లు తమ వంతు కార్యక్రమాలను నిర్వహించాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కోట సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు.

నెల్లూరు(బృందావనం): సమాజంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు జిల్లాలోని ధర్మప్రచారక్‌లు తమ వంతు కార్యక్రమాలను నిర్వహించాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కోట సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. రంగనాయకులపేటలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థాన ప్రాంగణంలో గల కల్యాణ మండపంలో శుక్రవారం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ధర్మప్రచారక్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న 12 నెలల్లో టీటీడీ ఆధ్వర్యంలో తలపెట్టిన 'మనగుడి' కార్యక్రమంపై ఆయా హిందూ« ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురాతనమైన హిందూధర్మాన్ని సంరక్షించేందుకు వివిధ ధార్మిక సంస్థల సమన్వయంతో కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నామని వివరించారు. సమరసత సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర సభ్యుడు శ్యామ్‌ప్రసాద్, జిల్లా సమితి అధ్యక్షుడు నాగారెడ్డి హరికుమార్‌రెడ్డి, హిందూ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, హెచ్‌డీపీటీ సభ్యులు  వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తపల్లి సాయివెంకటసుబ్రహ్మణ్యం, డాక్టర్‌ సునీల్‌కుమార్, భానుకిరణ్‌, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement