భద్రాది భగభగ.. | highest temparature in bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాది భగభగ..

Mar 20 2016 1:34 AM | Updated on Sep 3 2017 8:08 PM

భద్రాది భగభగ..

భద్రాది భగభగ..

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

- భద్రాచలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత
- హైదరాబాద్ సహా మూడు చోట్ల 41 డిగ్రీలు నమోదు

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల్లో 41 డిగ్రీలు నమోదయ్యాయి. రామగుండం, నల్లగొండ, మెదక్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

సగానికి పైగా రాష్ట్రంలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఆదిలాబాద్, హన్మకొండల్లో 39 డిగ్రీల చొప్పున, ఖమ్మంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇకపై ఎండలు తీవ్ర ప్రతాపం చూపిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement