సినీ హీరో బాలయ్య సందడి | Hero Balakrishna in Jadcherla | Sakshi
Sakshi News home page

సినీ హీరో బాలయ్య సందడి

Aug 19 2016 3:37 AM | Updated on Aug 29 2018 1:59 PM

బాలకృష్ణకు రాఖీ కడుతున్న మహిళ - Sakshi

బాలకృష్ణకు రాఖీ కడుతున్న మహిళ

హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జడ్చర్లలో సందడి చేశారు.

జడ్చర్ల(మహబూబ్ నగర్) : జడ్చర్లలో గురువారం ఉదయం ప్రముఖ సినీ హీరో ఏపీలోని హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. హైదరాబాద్‌ నుంచి సోమశిల  కృష్ణాపుష్కరాలలో పాల్గొనేందుకు వచ్చిన బాలకృష్ణ జాతీయరహదారిపై జడ్చర్ల వద్ద యగ్నేష్‌ హోటల్‌లో టీకోసం కొద్ది సేపు ఆగారు.

దీంతో హోటల్‌యజమాని రామ్మోహన్‌ తదితర కుటుంబ సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించి అతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా రాఖీ కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.  పలువురు ఆయనతో ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు. మరి కొందరు ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement