గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకున్న మంత్రి హరీష్రావు.. నగర ప్రజలను ఆలోచించి ఓటేయాలని కోరారు.
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకున్న మంత్రి హరీష్రావు.. నగర ప్రజలను ఆలోచించి ఓటేయాలని కోరారు. వరంగల్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. అలాగే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును సైతం వరంగల్లో ఏర్పాటు చేయనున్నట్లు హరీష్రావు ఆదివారం వెల్లడించారు. మార్చి 6వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్ల నుంచి మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.