హ్యాండ్‌ బ్యాగ్‌లో నగల చోరీ | Hand bag with gold ornaments stolen | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌ బ్యాగ్‌లో నగల చోరీ

Oct 27 2016 2:04 AM | Updated on Sep 4 2017 6:23 PM

హ్యాండ్‌ బ్యాగ్‌లో నగల చోరీ

హ్యాండ్‌ బ్యాగ్‌లో నగల చోరీ

కోవూరు : కుటుంబ సభ్యులందరూ గాఢనిద్రలో ఉండగా దుండగలు ఇంట్లోని హ్యాండ్‌ బ్యాగ్‌లోని వస్తువులు అపహరించారు. ఈ సంఘటన కోవూరు మండలంలోని చిన్నపడుగుపాడు నాగల కట్ట వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది.

కోవూరు : కుటుంబ సభ్యులందరూ గాఢనిద్రలో ఉండగా  దుండగలు ఇంట్లోని హ్యాండ్‌ బ్యాగ్‌లోని వస్తువులు అపహరించారు. ఈ సంఘటన కోవూరు మండలంలోని చిన్నపడుగుపాడు నాగల కట్ట వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది. బాధితుల కథనం మేరకు.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ మేలుకొని ఉన్నారు. బుధవారం ఉదయం నిద్రలేచి చూసే సరికి హ్యాండ్‌ బ్యాగ్‌లోని వస్తువులు అపహరణకు గురైన విషయాన్ని గుర్తించారు. బ్యాగ్‌లో పది సవర్ల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు, రూ.14 వేలు విలువ చేసే సెల్‌ఫోన్, రూ.5 వేలు నగదు ఉందని, బాధితురాలు ఎస్‌కే హఫిజిన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంటీఎం కార్డును బ్లాక్‌ చేశామన్నారు. ఎస్‌ఐ వెంకట్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐడీ పార్టీ సిబ్బంది విజయప్రసాద్, కృష్ణ, సత్యం చోరీ జరిగిన ఇంటి పరిసరాల్లో గాలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement