గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు.
ఆళ్లగడ్డ: గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. స్థానిక స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడు వివరాలను సీఐ వివరించారు. చాగలమర్రికి చెందిన నరసింహులు ఇతరులకు విక్రయించేందుకు ఇంటిలో నిల్వ చేయగా తమకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.