టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు.
రాజమండ్రి : టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో అన్యాయం జరిగిన దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులతో పరిహారం ఇప్పించినా అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ ప్రభుత్వానికి హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు.