‘గురుకులం’ విద్యార్థుల అదృశ్యం | gurukula school students missing | Sakshi
Sakshi News home page

‘గురుకులం’ విద్యార్థుల అదృశ్యం

Oct 20 2016 11:14 PM | Updated on Nov 9 2018 4:45 PM

మలుగూరు ఏపీఆర్‌ఎస్‌ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హిందూపురం రూరల్‌ : మలుగూరు ఏపీఆర్‌ఎస్‌ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... పైన పేర్కొన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పరిగి మండలం విట్టాపల్లికి చెందిన రాహుల్‌ కుమార్, 9వ తరగతి చదివే హిందూపురంలోని లక్ష్మీపురానికి చెందిన శివశంకుమార్‌ ఈ నెల 17న పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. విషయాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థుల ఆచూకీ కోసం పరిసరాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు గురువారం తమకు ఫిర్యాదు చేశారని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఆదినారాయణ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement