
అనుపాలెం ఎస్టీ కాలనీలో వైఎస్ జగన్ పర్యటన
జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన రెండోరోజు కూడా కొనసాగుతోంది.
గుంటూరు : జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఆయన మంగళవారం రాజుపాలెం మండలం అనుపాలెంలోని వరద బాధిత ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్నారు. స్థానికులు ఈ సందర్భంగా తమ గోడును వైఎస్ జగన్తో వెళ్లబోసుకున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారులు కూడా రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీలో పనులు చేసినా అడ్డుకుంటున్నారని, పంచాయతీ నిధులున్నా...పనులకు అడ్డుపడుతున్నారని తెలిపారు. కేసులు పెట్టి, వేధిస్తున్నారని వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని తమ బాధలు చెప్పుకున్నారు. అంతకు ముందు వైఎస్ జగన్ అనుపాలెంలో...వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.