హామీలను అమలు చేయాలి | Guarantees must be implemented | Sakshi
Sakshi News home page

హామీలను అమలు చేయాలి

Sep 21 2016 1:12 AM | Updated on Sep 4 2017 2:16 PM

సీఎం కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపెల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ డిమాండ్‌ చేశారు.

మోత్కూరు
సీఎం కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపెల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ డిమాండ్‌ చేశారు. మాదిగ చైతన్య పాదయాత్ర మంగళవారం మోత్కూరు మండల కేంద్రానికి చేరుకుంది. హైస్కూల్‌ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలువేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా టీఎమ్మార్పీఎస్‌ జెండాను యాతాకుల భాస్కర్‌ మాదిగ ఎగరవేశారు. అనంతరం దళితులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నవంబర్‌ 19వ తేదీలోపు దళితులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుంటే హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్యమాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు కూరెళ్ల ఎల్లయ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ దాసరి ప్రవీణ్, మండల అధ్యక్షుడు బాలెంల పరుశరాములు, నాయకులు దళిత యువసేన రాష్ట్ర కార్యదర్శి అలెగ్జండర్, నాయకులు కుప్పల రమేష్, దాసు,నరేష్,నవీన్, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement