గ్రూపు రాజకీయాలకు జూపల్లి ఆజ్యం | Group politics, fueled by the JUPALLY | Sakshi
Sakshi News home page

గ్రూపు రాజకీయాలకు జూపల్లి ఆజ్యం

Oct 10 2016 3:16 AM | Updated on Sep 17 2018 5:18 PM

గ్రూపు రాజకీయాలకు జూపల్లి ఆజ్యం - Sakshi

గ్రూపు రాజకీయాలకు జూపల్లి ఆజ్యం

అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నాగర్‌కర్నూ ల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు.

మాజీ ఎంపీ మందా జగన్నాథం ధ్వజం

 ఇటిక్యాల:  అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నాగర్‌కర్నూ ల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం కొండేరులో ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.  అలంపూర్‌లో గ్రూపులను ఏర్పాటు చేసి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని, ఇక్కడ దళితులు పార్టీ ఇన్‌చార్జిలుగా ఉండటం ఆయనకు ఇష్టంలేదన్నారు.

పార్టీకి చెందని నాయకులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులను అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రక్రియను టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేక రాజీనామాల పేరిట తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అలంపూర్ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉంటే తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement