జిల్లా ఎస్‌సీ, ఎస్‌టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నియామకానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డీవీఎంసీ సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్
Jan 30 2017 12:39 AM | Updated on Mar 21 2019 8:35 PM
కర్నూలు(అర్బన్): జిల్లా ఎస్‌సీ, ఎస్‌టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నియామకానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీవీఎంసీ సభ్యులుగా నియమితులయ్యేందుకు గతంలో జిల్లా నలుమూలల నుంచి 91 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్..పోలీసులతో విచారణ చేయించగా 24 మంది దరఖాస్తుదారులు కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో వారి దరఖాస్తులను మినహాయించి మిగిలిన 67 మందిని ఎంపిక చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్‌ను చైర్మన్‌గా కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్ సుదర్శన్ కుమార్, సీపీఓ డీ ఆనంద్‌నాయక్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ డీ హుసేన్‌సాహెబ్, ఎస్‌ఎస్‌పీ స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డిని నియమించారు. ఈ కమిటీ ఫిబ్రవరి మొదటి వారంలోగా సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement