అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ | green signal for assistant professor posts | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

Jul 6 2017 10:54 PM | Updated on Oct 9 2018 6:57 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రులు, మెడికల్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి పూనం మాలకొండయ్య గురువారం జీవో ఎంఎస్‌ నెం.108 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రులు, మెడికల్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి పూనం మాలకొండయ్య గురువారం  జీవో ఎంఎస్‌ నెం.108 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 ఖాళీలను డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అనాటమిలో 8, ఫిజియాలజిలో 8, బయోకెమిస్ట్రీలో 4, ఫార్మకాలజిలో 5, పాథాలజిలో 13, మైక్రోబయాలజిలో 4, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో 5, ఎస్‌పీఎంలో 6, జనరల్‌ మెడిసిన్‌లో 8, జనరల్‌ సర్జరీలో 17, ఆబ్‌స్ట్రిక్ట్‌అండ్‌ గైనకాలజిలో 17, అనెస్తీషియాలో 13, పీడియాట్రిక్స్‌లో 13, ఈఎన్‌టిలో 3, డీవీఎల్‌లో 3, టీబీసీడీలో 7, సైకియాట్రిలో 7, రేడియోడయోగ్రోసిస్‌లో 13, రేడియోథెరపిలో 4, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 3, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌లో 1, కార్డియాలజిలో 5, గ్యాస్ట్రో ఎంట్రాలజిలో 2, న్యూరాలజిలో 3, ఎండోక్రైనాలజిలో 1, నెఫ్రాలజిలో 1, సీటీ సర్జరీలో 4, ప్లాస్టిక్‌ సర్జరీలో 2, డెంటిస్టీలో 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement