పెద్దలకు ఒక తీరు! | Greater officials ignored the ban of flexi | Sakshi
Sakshi News home page

పెద్దలకు ఒక తీరు!

Jan 4 2017 11:56 PM | Updated on Aug 21 2018 12:18 PM

పెద్దలకు ఒక తీరు! - Sakshi

పెద్దలకు ఒక తీరు!

గ్రేటర్‌ వరంగల్‌ ప్రతిష్టను పెంచే కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఫెక్ల్సీల నిషేధం అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఫ్లెక్సీల నిషేధంపై  గ్రేటర్‌ అధికారుల నిర్లక్ష్యం
అధికార పార్టీ  ముఖ్యులకు  మినహాయింపు


వరంగల్‌ : గ్రేటర్‌ వరంగల్‌ ప్రతిష్టను పెంచే కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఫెక్ల్సీల నిషేధం అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు 2017 జనవరి 1 నుంచి వరంగల్‌ నగరంలో ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు నగరంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఈ ఆదేశాలు అధికారులు అమలు చేయాల్సి ఉంది. స్వయంగా మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటిం చినా... నిషేధం అమలు విషయాన్ని పట్టించుకోవడం లేదు. అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధుల విషయంలో గ్రేటర్‌ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

నగరంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. అధికారులు వాటిని తొలగించకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ నగర ప్రజల్లో మొదలైంది. మహానగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) తీసుకున్న నిర్ణయం సామాన్యులకే వర్తిస్తుందా... అందరికి వర్తిస్తుందా అనేది సందేహంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement