ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలి | GOVT Should Encourage Players | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలి

Aug 30 2016 12:49 AM | Updated on May 29 2019 2:59 PM

మాట్లాడుతున్న అంతర్జాతీయ క్రీడాకారుడు శంకర్‌ - Sakshi

మాట్లాడుతున్న అంతర్జాతీయ క్రీడాకారుడు శంకర్‌

కోయిల్‌కొండ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని అంతర్జాతీయ అథ్లెట్‌ శంకర్, అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు సుందర్‌రాజు అన్నారు. సోమవారం వారు మండలంలోని మనికొండ ఉన్నతపాఠశాలలో ఆజాద్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

కోయిల్‌కొండ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని అంతర్జాతీయ అథ్లెట్‌ శంకర్, అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు సుందర్‌రాజు అన్నారు. సోమవారం వారు మండలంలోని మనికొండ ఉన్నతపాఠశాలలో ఆజాద్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చే యువతీ, యువకులు ఎక్కువగా క్రీడల్లో రాణిస్తున్నారని వారిని ప్రభుతంతోపాటు గ్రామాల్లో ఉండే వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా లక్ష్యం పెట్టుకొని కషి చేయాలని అప్పుడే అనుకున్నది సాధించగలమన్నారు. అనంతరం వారిని పాఠశాల బందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బాలరాజు, సర్పంచ్‌ ఆంజనేయులు, నాయకులు గోరిసతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రహమాన్, పీఈటీ నిరంజన్, రాజు, శేఖర్, మురళీ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement