breaking news
Intrnational Athlet Shankar
-
ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలి
కోయిల్‌కొండ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని అంతర్జాతీయ అథ్లెట్ శంకర్, అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు సుందర్రాజు అన్నారు. సోమవారం వారు మండలంలోని మనికొండ ఉన్నతపాఠశాలలో ఆజాద్ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చే యువతీ, యువకులు ఎక్కువగా క్రీడల్లో రాణిస్తున్నారని వారిని ప్రభుతంతోపాటు గ్రామాల్లో ఉండే వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా లక్ష్యం పెట్టుకొని కషి చేయాలని అప్పుడే అనుకున్నది సాధించగలమన్నారు. అనంతరం వారిని పాఠశాల బందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి బాలరాజు, సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు గోరిసతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రహమాన్, పీఈటీ నిరంజన్, రాజు, శేఖర్, మురళీ పాల్గొన్నారు. -
రేపు సబ్‌జూనియర్ అత్యపత్య ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి అత్యపత్య పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను నారాయణపేట మండలం జాజాపూర్‌లో ఈ నెల 31న నిర్వహించనున్నట్లు జిల్లా అత్యపత్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోహైల్ ఉర్రహెమాన్, ముంతాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని, మిగతా వివరాలకు సెల్ నెం.9985313150, 9985979007 లను సంప్రదించాలని వారు కోరారు.