విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి | Govt should celebrate SEP 17th | Sakshi
Sakshi News home page

విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి

Aug 19 2016 8:01 PM | Updated on Mar 29 2019 9:31 PM

సమావేశంలో మాట్లాడుతున్న ఆచారి - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఆచారి

భూత్పూర్‌: తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి దినంగా ప్రకటించి ఆ రోజున వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ ఆచారి డిమాండ్‌ చేశారు.

భూత్పూర్‌: తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి లభించిన  సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి దినంగా ప్రకటించి ఆ రోజున వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ ఆచారి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేఎంఆర్‌ ఫంక్షన్‌ హల్‌లో జరిగిన పార్టీ జిల్లా స్థాయి పథాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఓట్ల బ్యాంకు రాజకీయాలు, మతోన్మాదశక్తులకు భయపడి వెనక్కి జరిగితే బీజేపీ పార్టీ తన సత్తాను చాటుతుందన్నారు. జిల్లాలోని అప్పంపల్లి తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో తిరంగా యాత్రను నిర్వహించి ప్రభుత్వ చేతగాని తనంపై ప్రచారం చేస్తామని ఆయన హెచ్చారించారు.
 
     పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి బూతు అధ్యక్షుడు నుంచి తెలంగాణ సీఎంకు పోస్టుకార్డు ద్వారా తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కనువిప్పు కలిగేలా ఉత్తరాలు రాస్తామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీవర్ధన్‌రెడ్డి, పడాకుల బాల్‌రాజు, మాంగ్యానాయక్, జిల్లా నాయకులు సుదర్శన్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, రవిందర్‌రెడ్డి, గాల్‌రెడ్డి, మండల అధ్యక్షులు నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement