సూర్యాపేట హైవేలో ప్రభుత్వ కార్యాలయాలు | Sakshi
Sakshi News home page

సూర్యాపేట హైవేలో ప్రభుత్వ కార్యాలయాలు

Published Wed, Oct 5 2016 12:32 AM

సూర్యాపేట హైవేలో ప్రభుత్వ కార్యాలయాలు - Sakshi

  • ఆలయ భూమి పరిశీలించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  • జనగామ : పట్టణ శివారు సూర్యాపేట హైవేలోని దేవాదాయ శాఖ భూమిలో జనగామ జిల్లా కార్యాలయాల నిర్మా ణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తెలిపారు. ఆర్డీవో వెంకట్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కనే దేశాదాయశాఖ పరిధిలో ఉన్న 25 ఎకరాల స్థలంలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట నిర్మించుకోవచ్చని తెలిపారు. దీని పక్కనే ఉన్న గార్లకుంటలో ఉన్న 15 ఎకరాలను పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. దేవాదాయశాఖ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం పరిశీ లించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరుతామన్నారు. అలాగే, తాత్కాలికంగా ధర్మకంచలోని ఇంటిగ్రేటెడ్‌ బాలికల వసతిగృహంలో కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజల కోరిక మేరకు జనగామను జిల్లా చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, డాక్టర్‌ సుగుణాకర్‌రా జు, కారింగుల రఘువీరారెడ్డి, పసుల ఏబేలు, కే.ఉపేందర్, ఆర్‌ఐ రాజు, వీ ఆర్‌వో రాజయ్య, రావెల రవి ఉన్నారు.
     
    జిల్లా కార్యాలయాలకు భవనాల పరిశీలన
    జనగామను జిల్లా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ సానుకూల ప్రకటన చేయగా అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. దసరా పండగ రోజు నుంచే నూతన జిల్లా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డీఎస్పీ పద్మనాభరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భవనాలను పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. పురపాలకసంఘంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనంతోపాటు ఇంటిగ్రేటెడ్‌ బాలికల హాస్టల్, ప్రగతి ఫార్మసి, వ్యవసాయ మార్కెట్‌లోని కాటన్‌ యార్డు, దేవాదుల క్వార్టర్స్, ఇండోర్‌ స్టేడియం గదులు, ధర్మకంచలోని బాలికల వసతిగృహం, 9 కమ్యూనిటీ హాళ్లను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు గుర్తించిన నూతన భవనాలను చూసేందుకు బుధవారం జనగామకు జేసీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ రానున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఆర్‌ఐ రాజు, వీఆర్‌వో రాజయ్య, నాయకులు గజ్జెల నర్సిరెడ్డి, బొల్‌ శ్రీనివాస్, ఆకుల సతీష్‌ ఉన్నారు.

Advertisement
Advertisement