ఆంధ్రా ఉద్యోగులూ.. గోబ్యాక్‌ | goback andhra employees | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఉద్యోగులూ.. గోబ్యాక్‌

Aug 26 2016 9:42 PM | Updated on Sep 4 2017 11:01 AM

రామగుండం : స్థానిక విద్యుత్‌ కేంద్రాలలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను స్వస్థలాలకు పంపించి అక్కడి తెలంగాణ ఉద్యోగులను సత్వరమే రిలీవ్‌ చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక బీ థర్మల్‌ జెన్‌కో కేంద్రం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

రామగుండం : స్థానిక విద్యుత్‌ కేంద్రాలలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను స్వస్థలాలకు పంపించి అక్కడి తెలంగాణ ఉద్యోగులను సత్వరమే రిలీవ్‌ చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక బీ థర్మల్‌ జెన్‌కో కేంద్రం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. కొన్ని విద్యుత్‌ కేంద్రాలలో ఇంకా ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల పెత్తనమే కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చలు జరిపి స్థానికత ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్ల సంఘం (టీఎస్‌పీఈఏ) ప్రతినిధులు డి.శంకరయ్య, కిష్టయ్య, చంద్రశేఖర్, కిషన్, రామ్‌కిషోర్, రాజేశ్వర్, ఖాజా, చైతన్య, కిరణ్‌‡కుమార్, పల్లవి, స్వాతి, స్పందన, అనిల్, శ్రద్ధానంద్, మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement