
ఆ మురిపాలు ఇకలేవు!
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు పాముకాటుతో మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయవిదారకం.
♦ పాముకాటుతో చిన్నారి మృతి
♦ గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు
యాచారం:అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు పాముకాటుతో మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ
రోదిం చిన తీరు హృదయ విదారకం. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని నల్లవెల్లి అనుబంధ నల్లవెల్లి తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన జర్పుల బిల్యా, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడు కు ఉన్నారు. సోమవారం రాత్రి వీరి రెండో కుమార్తె మహేశ్వరి(8) ఇంట్లో ఉండగా గుర్తుతెలియని పాము కాటేసింది.
ఈ విషయాన్ని గుర్తించలేని తల్లితండ్రులు మంగళవారం ఉదయం నీరసంగా కనిపించిన మహేశ్వరికి అన్నం తినిపించి ఉపాధి పనులకు వెళ్లారు. వారు మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి మహేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురై నురగులు కక్కుతూ కనిపిం చింది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం మాల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే మృతి చెందింది. బాలిక పాముకాటుకు గురై మృతిచెందినట్లు వైద్యులు గుర్తిం చారు. అల్లారుముద్దుగా పెంచుకుం టున్న కూతురు కళ్లెదుటే మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.