1,00,000 గారెలతో నివేదన | Gharelu offered to bandi agraharam anjaneya swamy | Sakshi
Sakshi News home page

1,00,000 గారెలతో నివేదన

Jun 1 2016 10:41 AM | Updated on Sep 4 2017 1:25 AM

1,00,000 గారెలతో నివేదన

1,00,000 గారెలతో నివేదన

హనుమజ్జయంతి సందర్భంగా దాసాంజనేయ స్వామికి భక్తులు లక్ష గారెలను నివేదించి ఘనంగా పూజలు చేశారు.

అమలాపురం రూరల్: హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరు శివారు బండివారి అగ్రహారంలో దాసాంజనేయ స్వామికి భక్తులు లక్ష గారెలను నివేదించి ఘనంగా పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే గారెల వంటకంలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు.

ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరిగాయి.  చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆంజనేయస్వామికి, సువర్చలాదేవికి  కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement