Garelu
-
బెండకాయ వడలు,జిగురు లేకుండా, క్రిస్పీగా ఫ్రై ట్రై చేశారా?
బెండకాయలు(lady Finger) తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉంచుతుంది. గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. అంతేనా బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. బెండలోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకుంటాయట. బెండకాయతో చేసుకునే వంటకాలను ఇపుడు చూద్దామా! బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటే, కొద్దిగా నిమ్మరసం వేసి ఆ జిగురుని పోగొట్టొచ్చు. అభిరుచిని బట్టి వెనిగర్ కూడా వాడుకోవచ్చు. అలాగే వాడిపోయిన బెండకాయలను తిరిగి తాజాగా మార్చడానికి, ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీటిలో వాటిని 10 నిమిషాల పాటు ఉంచాలి. వంట చేసేటప్పుడు బెండకాయలనుమరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, అలా చేస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!బెండకాయ ఫ్రైలేత బెండకాయ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో శుభ్రం చేసి, పొడిగా తుడుచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా గుండ్రంగా కోసి పక్కన పెట్టుకోవాలి. కోసే తడి లేకుండా ఉండాలి.బాండ్లీ పెట్టుకొని ఆవాలు చిటపటలాడించి, శనగపప్పు మినపప్పు , ఎండుమిర్చి, ఎండు ఎర్ర మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి సన్న మంట మీద వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక తరిగిన బెండకాయ ముక్కలు వేసి, పాన్ మీద మూతపెట్టకుండా తక్కువ మంట మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా కొబ్బరిపొడి (ఆప్షనల్) తగినంత ఉప్పు, కారం, పసుపు చల్లి మరికొంచెం వేగనిచ్చిదింపేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలోగానీ, సాంబారు, రసంతో కానీ నంజుకొని తినవచ్చు. చపాతీ లేదా సాదా పరాఠాతో కూడా లాగించొచ్చు. బెండకాయ వడలుకావలసినవి: బెండకాయలు– 5 (మీడియం సైజ్, చిన్నగా తరగాలి), శనగపప్పు– ఒక కప్పు (15 నిమిషాలు నీళ్లల్లో నానబెట్టుకోవాలి), దాల్చినచెక్క– 2 (చిన్న ముక్కలు), వెల్లుల్లి– 5, జీలకర్ర– అర టీ స్పూన్, ఎండుమిర్చి– 4, ఉల్లిపాయ– 1 (చిన్నగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి), ఉప్పు– తగినంత, నూనె– సరిపడాతయారీ: ముందుగా మిక్సీ బౌల్లో దాల్చినచెక్క ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన శనగపప్పు వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి, దానిలో శనగపప్పు మిశ్రమం వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి, వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
Kanuma special recipe : చిట్టి గారెలు, నాటు కోడి పులుసు, డెడ్లీ కాంబినేషన్
సంక్రాంతి పండగ అంటేనే పిండివంటలు.భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులు అనేక రకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. అరిశెలులు, సున్నుండలు, సకినాలు, పొంగడాలు, జంతికలు, తీపి బూంది ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వీటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా పొంగల్, పరమాన్నం, బెల్లం అన్నం ఇలా ఒక్కో చోట ఒక్కో రకం. కానీ కనుమ రోజు అయితే మాంసాహార ప్రియులకు పండగే. మరీ ముఖ్యంగా గారెలు, నాటుకోడి పులుసు మరింత ప్రత్యేకం. మరి క్రిస్పీగా గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం!ప్రాంతం ఏదైనా, పండగ ఏదైనా మినపగారెలు , నాటు కోడి కాంబినేషన్ చాలా ఫ్యామస్. ఈ రెండింటి కాంబినేషన్ రుచితోపాటు, ప్రోటీన్లను కూడా అధికంగా అందిస్తాయి. తయారీముందుగా 2 కప్పుల మినపప్పు, కొంచెం బియ్యం వేసి కనీసం నాలుగైదు గంటల పాటు నానెబట్టుకోవాలి. ఇందులో ఇనుప గరిటె, లేదా అట్ల కాడ వేస్తే తొందరగా నానుతుందని చెబుతారు. పొట్టు పప్పుఅయితే పొట్టు పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేకుండా వంపుకోవాలి. దీన్ని మెత్తగా, కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి(రుబ్బుకుంటే ఇంకా బావుంటుంది). ఇందులో పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి.తరువాత స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. గారెలు వేసే ముందు నీటితో చేతులను తడి చేసుకుని, అరిటాకుపై చక్కగా గుండ్రంగా అద్దుకోవాలి,మధ్యలో మధ్యలో చిన్న రంధ్రం చేసి వేడి నూనెలో జాగ్రత్తగా వేయాలి. ఆ తర్వాత మీడియం మంటపై గారెలను రెండు వైపులా సమానంగా వేయించుకోవాలి. దీని వల్ల నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. టిష్యూ పేపర్ వేసిన గిన్నెలో వేసుకుంటే అదనపు నూనెను పీల్చేస్తుంది. నాటుకోడి పులుసు తయారీముందుగా నాటు కోడి(మరీ ముదురు కాకుండాస్త్ర మాంసాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,ఎండుమిర్చి, లవంగాలు,యాలకులు, వెల్లుల్లి, జాజికాయ ,స్పూన్ ధనియాలను నూనెలేకుండా మూకుడులో దోరగా వేయించుకిన పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు,ఎండు కొబ్బరి , గసగసాలు,సారపప్పు జీలకర్ర కలిపి మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.కుక్కర్లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని యించుకోవాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. ఇపుడు ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుని మరికాసేపు వేయించుకోవాలి. ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ పెరుగు వేసి, సన్న మంట మీద మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలాక, మ్యారినేట్ చేసుకున్ననాటుకోడి ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాతమసాలా పేస్ట్, కొద్దిగా కారం,ఉప్పు కూడావేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి..అనంతరం కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. మూత వచ్చాక,ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా ఉంటే మరికొద్దిసేపు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాటే, టేస్టీ టేస్టీ నాటుకోటి పులుసురెడీ. ఈ నాటుకోడి పులుసుతో లేదా చికెన్ కూరతో వేడి వేడి గారెలను నంజుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు.ఇదీ కూడా చదవండి: Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా? -
Recipe: ఉలవ గారెలు తిన్నారా? ఇదిగో ఇలా చేసుకోండి!
జిహ్వకు కొత్త రుచిని అందించే ఉలవ గారెల తయారీ ఇలా! ఉలవ గారెల తయారీకి కావలసినవి: ఉలవలు – 2 కప్పులు మినప్పప్పు – 1 కప్పు (నానబెట్టి, కడిగి, రెండూ కలిపి మిక్సీలో వేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు బేకింగ్ సోడా – అర టీ స్పూన్ బొంబాయి రవ్వ, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్ చొప్పున నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో ఉలవల పిండి, బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, మొక్కజొన్న పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలిపి గారెల పిండిలా గట్టిగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో నూనె పోసుకుని, వేడి కాగానే అందులో గారెలు వేసుకుని, దోరగా వేయించుకోవాలి. వీటిని సాంబార్లో లేదా పెరుగులో వేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. లేదంటే సాస్‌తో కానీ, కొత్తిమీర చట్నీతో కానీ తినొచ్చు. చదవండి: Butter Tea: సువాసన భరిత బటర్ టీ.. టింగ్మో, ఖమీరి రోటీ ఇంట్లోనే ఇలా ఈజీగా! -
1,00,000 గారెలతో నివేదన
అమలాపురం రూరల్: హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరు శివారు బండివారి అగ్రహారంలో దాసాంజనేయ స్వామికి భక్తులు లక్ష గారెలను నివేదించి ఘనంగా పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే గారెల వంటకంలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆంజనేయస్వామికి, సువర్చలాదేవికి కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు.