గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల హస్తం! | ganja illegal business and more than two tons seized | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల హస్తం!

Nov 20 2016 12:14 PM | Updated on Aug 11 2018 8:11 PM

ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తున్న గంజాయి లోడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చింతూరు: ఒడిశా నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న గంజాయి లోడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని రత్నాపురం గ్రామంలో ఆదివారం రోజు తనిఖీలు చేసిన పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,125 కిలోల గంజాయితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 63.70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గంజాయి అక్రమ రవాణకు సహకరిస్తున్న ఓ సీఐ, కానిస్టేబుల్ పై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి తెలంగాణకు భారీగా గంజాయి తరలించడానికి సహకరించిన మారేడుమిల్లి సీఐ అంకబాబుతో పాటు కానిస్టేబుల్ సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు చింతూరు ఓఎస్‌డీ డాక్టర్ కే. ఫకీరప్ప విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement