మార్టేరులో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు | from to day statewide basket ball games in marteru | Sakshi
Sakshi News home page

మార్టేరులో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు

Aug 26 2016 6:40 PM | Updated on Sep 4 2017 11:01 AM

మార్టేరు(పెనుమంట్ర) : గ్రామంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇన్విటేషన్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలు జరగనున్నాయి.

మార్టేరు(పెనుమంట్ర) : గ్రామంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇన్విటేషన్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలు జరగనున్నాయి. గ్రామానికి చెందిన దివంగత ఫిజికల్‌ డైరెక్టర్‌ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్‌ పేరిట ఈ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో బాస్కెట్‌ బాల్‌ కోర్టు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు పోటీలను పారిశ్రామిక వేత్త గొలుగూరి శ్రీరామారెడ్డి ప్రారంభిస్తారని, విశిష్ట అతి«థిగా వైఎస్సార్‌ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయ కర్త కవురు శ్రీనివాసు హాజరవుతారని చెప్పారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement